వానల ఎఫెక్ట్.. విద్యాసంస్థలకు సెలవులు

వానల ఎఫెక్ట్.. విద్యాసంస్థలకు సెలవులు

కర్ణాటకలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్ష ప్రభావిత ప్రాంతాలైన మూడు జిల్లాల్లో ఇవాళ పాఠశాలలు, కాలేజీలకు అధికారులు సెలవులు ప్రకటించారు. బెంగళూరులోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం బసవరాజ్ బొమ్మై సందర్శించారు. బాధితులను పరామర్శించి అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇప్పటి వరకు భారీ వర్షాలకు తొమ్మిది మంది చనిపోయారు. పలు ఇళ్లు పాక్షితంగా దెబ్బతిన్నాయి. వర్షాల కారణంగా వందల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. చిక్ మగళూరు, దక్షిణ కన్నడ, ఉడిపి, కొడుగు, శివమొగ్గ, దావణగెరె,హాసన్ ప్రాంతాల్లో వాతావరణశాఖ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. రాబోయే రెండు రోజులు పాటు పలు ప్రాంతాల్లో వానలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రజలను అలర్ట్ చేస్తూ సహాయక చర్యలు ముమ్మరం చేశారు. 

మరిన్ని వార్తల కోసం

తొలి 5జీ కాల్ చేసిన కేంద్ర మంత్రి

లాలూ ప్రసాద్ యాదవ్ పై మరో కేసు