డబ్బులే డబ్బులంట : 17 మంది ప్రభుత్వ ఉన్నతాధికారులపై ఏసీబీ రైడ్స్

డబ్బులే డబ్బులంట : 17 మంది ప్రభుత్వ ఉన్నతాధికారులపై ఏసీబీ రైడ్స్

కర్ణాటకలోని లోకాయుక్త అధికారులు 17 మంది ప్రభుత్వ అధికారులకు చెందిన 70కి పైగా ప్రాంతాల్లో దాడులు జరిపారు. ఈ క్రమంలోనే భారీ మొత్తంలో నగదు, బంగారం, స్థిరాస్తులు, విలాసవంతమైన వాహనాలు, భూములపై ​​పెట్టుబడులు, స్టాక్స్, ఖరీదైన గ్యాడ్జెట్లను గుర్తించినట్లు లోకాయుక్త వర్గాలు తెలిపాయి.

పోలీసుల సహాయంతో లోకాయుక్తకు చెందిన అనేక బృందాలు తెల్లవారుజామున సోదాలు నిర్వహించాయని సీనియర్ లోకాయుక్త అధికారులు తెలిపారు. తాము కర్నాటక వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులపై 17 కేసులు నమోదు చేశామని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లోకాయుక్త) డాక్టర్ ఎ సుబ్రమణ్యేశ్వర చెప్పారు. ఈ దాడులు 70ప్రాంతాల్లో జరిగాయన్నారు.

ALSO READ : ఇంటికో బండి: గ్రేటర్ హైదరాబాద్లో పర్సనల్ వెహికల్స్ 70 లక్షలు

 
బెంగళూరు, మాండ్య, రాయచూర్, బీదర్, కలబురగి, చిత్రదుర్గ, బళ్లారి, తుమకూరు, ఉడిపి, హాసన్, బెళగావి, దావణగెరె, హావేరి జిల్లాల్లో ఈ దాడులు నిర్వహించినట్లు లోకాయుక్త వర్గాలు తెలిపాయి. ఈ సోదాల్లో భాగంగా విచారణలు కూడా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.