మంత్రులకు కొత్త కార్లు ఇచ్చిన ప్రభుత్వం

మంత్రులకు కొత్త కార్లు ఇచ్చిన ప్రభుత్వం

కర్ణాటకలో ఈ ఏడాది కొలువుదీరిన మంత్రి వర్గానికి సీఎం సిద్ధరామయ్య కానుక అందించనున్నారు. ఒక్కో మంత్రి కొత్త హైఎండ్ హైబ్రిడ్ కార్లను అందుకోనున్నారు. ఇందుకోసం 33 కార్లు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయించింది. 

ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్‌తో పూర్తిగా ఇథనాల్‌తో నడిచే  టయోటా కార్లను ఇప్పటికే ఆర్డర్ పెట్టింది. ఈ మోడల్ ని ఆగస్టు 29న విడుదల చేశారు. ఒక్కో కారు ధర రూ.30 లక్షలు. అయితే ప్రతిపక్ష బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది.

Also Read :- శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా కొకైన్ పట్టివేత

ఆర్థిక సంక్షోభం, ప్రకృతి వైపరీత్యాలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజల్ని ఆదుకోవాల్సిన టైంలో డబ్బులు దుబారా చేయడం ఏంటని ఆ పార్టీ ఎమ్మెల్యే అశ్వత్ నారాయణ్ ప్రశ్నించారు. 

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు గడుస్తున్నా పబ్లిక్ ని పట్టించుకోవట్లేదని ఆరోపించారు. కార్ల కొనుగోలుకు వెచ్చించే డబ్బుల్ని ప్రజా సంక్షే మానికి ఉపయోగించాలని డిమాండ్ చేశారు.