మోసగాళ్లకు మోసగాళ్లు.. ఎమ్మెల్యే టికెట్లు ఇప్పిస్తానంటూ రూ.7 కోట్లు కొట్టేశారు

మోసగాళ్లకు మోసగాళ్లు.. ఎమ్మెల్యే టికెట్లు ఇప్పిస్తానంటూ రూ.7 కోట్లు కొట్టేశారు

అసెంబ్లీ టికెట్ల కోసం ఎంత పోటీ ఉంటుందో తెలియంది కాదు. పొలిటికల్ లీడర్లు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, ప్రముఖులు  ఎన్నికల్లో సీటు దక్కడానికి కోట్లకు కోట్లు ఖర్చు చేస్తుంటారు. ఎంత డబ్బు పెట్టడానికైనా సిద్దంగా ఉంటారు.   అయితే ఇదే ఆసరగా  తీసుకుని కొందరు కేటుగాళ్లు కొట్లు దండుకుంటున్నారు.   ఎమ్మెల్యే టికెట్ ఆశచూపి ఓ బిజినెస్ మ్యాన్ నుంచి  ఏకంగా 7 కోట్లు కొల్లగొట్టారు.

కర్ణాటక ఉడిపి జిల్లాలోని బైందూరు నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్‌ ఇప్పిస్తానని ఓ వ్యాపారిని మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను బెంగళూరులోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) అధికారులు అరెస్టు చేశారు.  ప్రధాన నిందితుడు చైత్ర కుందాపురాతో సహా ఇద్దరిని సెప్టెంబర్ 12 రాత్రి ఉడిపి శ్రీకృష్ణ మఠంలోని పార్కింగ్ ప్రాంతం  దగ్గర  అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.  ఆమెతో పాటు మరో నిందితుడు శ్రీకాంత్ నాయక్ పెలత్తూరు ఉన్నారు. 

గోవిందబాబు పూజారి అనే వ్యక్తి ప్రముఖ వ్యాపారవేత్త, సమాజ సేవకుడిగా పేరు పొందిన బిల్లవ సామాజికి వర్గానికి చెందిన నాయకుడు గోవింద బాబు..బైందూరు  టికెట్ కోసం  ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ వ్యాపార వేత్త అమాయకత్వాన్ని ఆసరగా తీసుకున్న  చైత్ర కుందాపూర్ ఓ బృందం కోట్లు దండుకుంది.  విడుతల వారీగా మొత్తం 7 కోట్లు దోచుకున్నారు.   గత అసెంబ్లీ ఎన్నికల్లో బైందూరు నుంచి బీజేపీ టికెట్‌ ఇస్తానని హామీ ఇచ్చి భారీ మొత్తంలో నగదు తీసుకుని  మోసం చేశారు.

ఈ చీటింగ్ కేసులో ఇప్పటి వరకు నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.  చైత్ర కుందాపుర, నాయక్‌లతో పాటు గగన్‌ కడూరు, ప్రసాద్‌లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు  తెలిపారు.ఇద్దరినీ విచారిస్తున్నామని, బెంగళూరుకు తరలించి కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.