కర్ణాటకలో దంచికొడుతున్న వానలు

కర్ణాటకలో దంచికొడుతున్న వానలు

కర్ణాటక వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి.ఈనెల 9 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్ణాటకలోని 3 కోస్తా జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. భారీ వర్షాల దృష్ట్యా పలు చోట్ల స్కూళ్లు, కాలేజీలకు అధికారులుసెలవులు ప్రకటించారు. దావణగెరె జిల్లాలో భారీ వర్షాలతో రెడ్ అలెర్ట్ జారీ చేశారు. ఉత్తర కన్నడ ప్రాంతాలైన బెల్గాం, చిక్కమంగళూరు, కొడగు, షిమోగా ప్రాంతాల్లో భారీ వర్షానికి రోడ్లపై నీరు నిలిచింది. బీదర్, కలబురిగిలో వానలతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో కరెంట్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.