బాలిక‌పై బ‌లాత్కారం.. చ‌ర్చి ఫాద‌ర్ పై కేసు

బాలిక‌పై బ‌లాత్కారం.. చ‌ర్చి ఫాద‌ర్ పై కేసు

కర్ణాటకలో ఓ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. శివమొగ్గలోని ఓ కళాశాలలో మైనర్ బాలికను లైంగికంగా వేధించినందుకు గానూ చర్చి ఫాద‌ర్ ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) చట్టం కింద కూడా పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.

శివమొగ్గలోని ఓ కాలేజీలో ఫాదర్ టీచర్‌గా పని చేస్తున్నట్టు సమాచారం. కళాశాల కూడా చర్చి కిందకే వస్తుందని పలు నివేదికలు తెలిపాయి. రిజర్వ్‌డ్ కేటగిరీకి చెందిన బాధితురాలుపై ఫాదర్.. కుల దూషణ ఆరోపణలు చేసినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అతనిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు తీవ్ర తరం చేస్తామని హెచ్చరించినట్లు సమాచారం. ఇలాంటి కేసులు మరిన్ని ఉన్నాయని కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు.