హై బీమ్ ఎల్ఈడీ లైట్ వాహనాలపై కర్ణాటక ప్రభుత్వం ఉక్కుపాదం...

హై బీమ్ ఎల్ఈడీ లైట్  వాహనాలపై కర్ణాటక ప్రభుత్వం ఉక్కుపాదం...

ఇటీవల కాలంలో వాహనాలకు హై బీమ్ ఎల్ఈడీ హెడ్ లైట్స్ వాడకం పెరిగిపోతోంది. వీటి వాడకం వల్ల ఎదురుగా వచ్చే వాహనదారులకు రోడ్డు కనపడక యాక్సిడెంట్స్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ ప్రమాదాలను అరికట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.హై బీమ్ ఎల్ఈడీ హెడ్ లైట్స్ ఉన్న వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేసింది. ఒక్కవరంలోనే 8244 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు అధికారులు.

హై బీమ్ ఎల్ఈడీ లైట్స్ వాడకం ప్రమాదాలకు దారి తీస్తుందని, వీటివల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ చాలా మంది వాహనదారులు ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం తొలిసారి వీటి వినియోగంపై చర్యలకు సిద్ధమైంది.కర్ణాటక ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని దేశం మొత్తం ఇదే విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నారు నెటిజన్స్