ఇంకెక్కడ చదువు..! స్ట‌డీ టూర్‌లో టీచ‌ర్ - స్టూడెంట్ రొమాన్స్‌

ఇంకెక్కడ చదువు..! స్ట‌డీ టూర్‌లో టీచ‌ర్ - స్టూడెంట్ రొమాన్స్‌

చదువుకోరా అని మీ పిల్లాడిని బడికి పంపుతున్నారా! అయితే మీరు ఇక జాగ్రత్త పడాల్సిందే.. మీ పుత్రరత్నం కదలికపై ఓ కన్నేయాల్సిందే. లేదు లేదు మా పిల్లాడు నిప్పు, దారి తప్పడు అనకండి. ఏ పుట్టలో ఏ పాముందో.. మీ పిల్లాడి నిప్పైనా.. చదువు చెప్పే పంతులమ్మలు మంచిగుండాలిగా..! ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా. కర్నాటకకు చెందిన టీచ‌ర్ - స్టూడెంట్ ఇద్దరూ స్ట‌డీ టూర్‌లో ముద్దులు, కౌగిలింతలతో రెచ్చిపోయారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడంతో సదరు టీచ‌ర్ - స్టూడెంట్ వ్యవహారం రాష్ట్రమంతటా మార్మోగుతోంది.  

కర్నాటక, చింతామణి తాలూకాలోని మురుగమల్లా గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు స్ట‌డీ టూర్‌ వెళ్లారు. వీరితో పాటు ఆ పాఠశాలకు చెందిన మహిళా ప్రధానోపాధ్యాయురాలు, మరికొందరు ఉపాధ్యాయులు వెళ్లారు. అక్కడకి వెళ్ళాక వాతావరణం చల్లగుందేమో కానీ, ప్రధానోపాధ్యాయురాలు గాడి తప్పింది. పదో తరగతి విద్యార్థితో వెర్రివేషాలు వేసింది. ఇద్ద‌రూ క‌లిసి ప‌చ్చ‌ని చెట్ల మ‌ధ్య ప్రేమికుల్లా ఫొటోషూట్ చేశారు. పోనీ, అంతటితో ఆగారా.. అంటే హా హా. 

చూస్తుండగానే ఆ ఫొటోషూట్ సినిమాల్లో సన్నివేశాల్లా రొమాంటిక్ సీన్‌లోకి వెళ్లిపోయింది. విద్యార్థి టీచ‌ర్ కొంగు లాగుతుంటే, ఆమె సిగ్గు ఒల‌క‌బోస్తూ ఫోజులిచ్చింది. ఆపై విద్యార్థి టీచ‌ర్‌ బుగ్గపై మురిపంగా ముద్దుపెడుతూ త‌న ప్రేమ‌ను పంచాడు. అనంతరం తన రెండు చేతులతో పైకి ఎత్తుకుని ప్రేమ‌లో ముంచెత్తాడు. ఆ సమయంలో టీచర్ కూడా బాగానే అతనికి సహకరించింది. ఎక్కడ ఆగిపోతాడో అని రిటర్న్ ముద్దులిస్తూ బాగా ఎంకరేజ్ చేసింది. ఒకరకంగా ఇద్దరు పచ్చని ప్రకృతిలో పర్వశించిపోయారు.

వీరి ఫొటోషూట్‌కు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ్వడంతో.. సదరు స్టడీ టూర్ వెళ్లిన పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులందరూ స్కూల్ ముందు టెంట్లు వేసుకొని కూర్చున్నారు. ఈ ఘ‌ట‌న‌పై విద్యార్థి త‌ల్లిదండ్రులు బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (BEO)కి ఫిర్యాదు చేశారు. ఆమె ప్రవర్తనపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు.