ఆంక్షలు సండలించిన కర్నాటక ప్రభుత్వం

ఆంక్షలు సండలించిన కర్నాటక ప్రభుత్వం

బెంగళూరు: కర్నాటకలో కొవిడ్ కేసుల సంఖ్య తగ్గుతుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి నైట్ కర్ఫ్యూ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. బెంగళూరులో స్కూళ్లు, కాలేజీలు తెరిచేందుకు అనుమతించింది. అయితే కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. కరోనా కారణంగా హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యే వారి సంఖ్య 2శాతానికి తగ్గడం, రికవరీ రేటు పెరగడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కర్నాటక సర్కారు సవరించిన మార్గదర్శకాల ప్రకారం సోమవారం నుంచి ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిస్థాయి సిబ్బందితో పనిచేయనున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు, పబ్బులు, బార్లు 100శాతం కెపాసిటీతో ఓపెన్ చేసేందుకు పర్మిషన్ ఇచ్చారు. థియేటర్ల, ఆడిటోరియంలు, మల్టీప్లెక్సులు, స్విమ్మింపూల్స్, జిమ్స్ లు మాత్రం 50శాతం శాతం కెపాసిటీతోనే తెరిచేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ప్రభుత్వ రవాణా, మెట్రోల్లో సీటింగ్ కెపాసిటీ మేరకే ప్రయాణికుల్ని అనుమతించనున్నారు. ఇళ్లు, ఫంక్షన్ హాళ్లలో నిర్వహించే పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు 200 మంది, ఔట్ డోర్ లో నిర్వహించే వాటికి హాజరయ్యే అతిథుల సంఖ్యను 300కు పరిమితం చేసింది.

For more news..

పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థి నామినేషన్ దాఖలు

మహిళా కమిషన్ నోటీసులు.. రూల్స్ మార్చిన ఎస్బీఐ