లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. ముగ్గురు మృతి

లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. ముగ్గురు మృతి

కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న SRS ట్రావెల్స్ బస్సు…కర్నూలు శివారు చిన్నటేకూరు దగ్గర ఆగి ఉన్న పైపుల లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు స్పాట్ లోనే చనిపోగా మరికొంతమంది గాయపడ్డారు. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందించారు. కొద్దిరోజుల కింద…ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో…ఇదే సంస్థకు చెందిన బస్సు ప్రమాదానికి గురై 17 మంది ప్రాణాలు కోల్పోయారు.