కరీంనగర్ కో ఆపరేటివ్‌ అర్బన్ బ్యాంక్ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కర్ర రాజశేఖర్ ఎన్నిక

కరీంనగర్ కో ఆపరేటివ్‌ అర్బన్ బ్యాంక్ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కర్ర రాజశేఖర్ ఎన్నిక

కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్ కో ఆపరేటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అర్బన్ బ్యాంకు చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సోమవారం ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికలో కర్ర రాజశేఖర్ ఒక్కడే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మధ్యాహ్నం తర్వాత కొత్త చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాతో మాట్లాడుతూ బ్యాంకును లాభాల బాటపట్టించేలా సంస్కరణలు తెస్తామని ప్రకటించారు.

ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లాగానే హోంలోన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పర్సనల్ లోన్లు ఇచ్చేలా బ్యాంకును తీర్చిదిద్దుతామన్నారు.  ఇకపై పకడ్బందీ వ్యవస్థను రూపొందిస్తానన్నారు.  ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంకింగ్, ఏటీఎం, యూపీఐ సేవలు ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో తాను చైర్మన్ గా ఉన్నప్పుడు ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. కొత్త పాలకవర్గాన్ని బ్యాంకు మాజీ చైర్మన్ బొమ్మరాతి రాజేశం, డైరెకర్లు దేశ వేదాద్రి, కన్నసాయి, బాశెట్టి కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బండి ప్రశాంత్ దీపక్, సాయికృష్ణ, జ్యోతి, శ్వేత, సిబ్బంది అభినందించారు.