Karthi30: బర్త్‌డే ట్రీట్ అదిరింది.. కార్తి-కళ్యాణ్ శంకర్ మూవీపై క్రేజీ అప్డేట్

Karthi30: బర్త్‌డే ట్రీట్ అదిరింది.. కార్తి-కళ్యాణ్ శంకర్ మూవీపై క్రేజీ అప్డేట్

తమిళ స్టార్ హీరో కార్తి ఇవాళ (మే25, 2026న) తన 49వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కార్తి నటిస్తున్న తెలుగు సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ‘మ్యాడ్’ ఫేమ్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం పూజా ఈవెంట్ ఘనంగా జరుపుకుంది.

ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.. కార్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైందని, ప్రస్తుతం పూర్తి స్థాయిలో షూటింగ్ జరుపుకుంటుందని వెల్లడించింది. అలాగే త్వరలోనే ఈ చిత్ర టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది.

“ఎప్పుడూ ఎనర్జీతో, తనదైన శైలితో అభిమానులను అలరించే కార్తికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రేక్షకులు ఊహించని ఓ సరికొత్త ఎంటర్‌టైనర్‌తో ఆయనను మీ ముందుకు తీసుకురావడం ఆనందంగా ఉంది. #Karthi30 షూటింగ్ పూర్తి స్థాయిలో జరుగుతోంది. టైటిల్, ఫస్ట్ లుక్ త్వరలో రానున్నాయి” అని పేర్కొన్నారు.

యూత్‌‌‌‌ఫుల్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌గా రూపొందనున్న ఈ సినిమాలో హీరోయిన్‌‌‌‌గా మీనాక్షి చౌదరి నటిస్తుంది. కార్తి, మీనాక్షి చౌదరి కలిసి నటించడం ఇదే తొలిసారి కావడంతో తెలుగు & తమిళ ఆడియన్స్లో క్యూరియాసిటీ పెరిగింది. అలాగే, కార్తి స్క్రీన్ ప్రెజెన్స్, కళ్యాణ్ శంకర్ ఎనర్జిటిక్ స్టోరీటెల్లింగ్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనున్నాయనే ఆసక్తి నెలకొంది.

ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. నిర్మాత నాగవంశీ హీరో సూర్యతో ‘విశ్వనాథ్ & సన్స్’ మూవీని భారీగా తెరకెక్కిస్తున్నారు. లక్కీ భాస్కర్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో సినిమా రూపొందుతుంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఇప్పటికే ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి సక్సెస్ ఫుల్ సినిమాలతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మంచి జోష్ లో ఉంది.