
తమిళ ఇంస్ట్రీ నుంచి ఒకేరోజు ఇద్దరు స్టార్ హీరోల సినిమాల అప్డేట్స్ వచ్చాయి. ధనుష్ D54 అప్డేట్ తోనే తమిళ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే కార్తి తన కొత్త సినిమా పోస్టర్ రిలీజ్ చేసి మరింత హైప్ పెంచాడు.
కార్తి హీరోగా ‘తానక్కరన్’ఫేమ్ తమిజ్ దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ఈ సినిమాకు ‘మార్షల్’ అనే టైటిల్ ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘‘డియర్ ఫ్రెండ్స్, మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలతో ఓ కొత్త అడుగు ముందుకు వేస్తుంది. మార్షల్ ఈ రోజే మొదలవుతుంది’’ అని కార్తి X లో పోస్టు చేశాడు.
Dear Friends,
— Karthi (@Karthi_Offl) July 10, 2025
Taking a new step forward with all your love and blessings!! #Marshal #மார்ஷல் begins from today!! pic.twitter.com/KzxDxRpYRa
రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ అంచనాలు పెంచుతోంది. డైరెక్టర్ తమిజ్ ఈ సినిమాని పీరియాడిక్ కోస్టల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్లో కోస్టల్ విలేజ్, పాతకాలం నాటి పనిముట్లు, చుట్టూ జనాలు కనిపిస్తున్నారు. కానీ పోస్టర్లో కార్తి ముఖం కనిపించలేదు.
ఇకపోతే ‘మార్షల్’ విషయానికి వస్తే.., కార్తి నటిస్తున్న 29వ సినిమా ఇది. ఇందులో కార్తి సరసన కల్యాణి ప్రియదర్శన్ నటిస్తోంది. సత్యరాజ్, ప్రభు, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు, ఇషాన్ సక్సేనా, సునీల్ షా, రాజా సుబ్రమణియన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
డైరెక్టర్ తమిజ్ విషయానికి వస్తే.. సూర్య నటించిన జై భీమ్ మూవీలో SI గురుమూర్తి పాత్రలో విలన్గా నటించారు. SI గురుమూర్తి పాత్ర ద్వారా ఆయన బాగా ప్రసిద్ధి చెందారు. ఆయన తానక్కరన్ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీతో విమర్శకులు మరియు సాధారణ ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకున్నారు.
ఆ తర్వాత వరుసగా మరో 4 సినిమాలు డైరెక్ట్ చేసి, దర్శకుడిగా తనదైన ముద్ర వేశాడు. ఆయన చిత్ర పరిశ్రమలో కెరీర్‌ను కొనసాగించాలని నిర్ణయించుకునే ముందు 12 సంవత్సరాలు తమిళనాడు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్‌గా పనిచేశారు. చిన్నప్పటి నుంచి అతనికి సినిమాలు డైరెక్ట్ చేయాలనే కోరిక ఉండేది. ఈ క్రమంలోనే ఓ పక్క నటిస్తూ, మరోపక్క డైరెక్టర్గా రాణిస్తూ బిజీగా ఉన్నాడు.
— directortamil (@directortamil77) September 15, 2024