96 మూవీ ఫేమ్ సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన సత్యం సుందరం చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో తమిళ్ ప్రముఖ హీరోలైన అరవింద్ స్వామి, కార్తీ హీరోలుగా నటించగా శ్రీదివ్య, దేవ దర్శిని, స్వాతి కొండే తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.
ఫ్రెండ్షిప్ మరియు ఎమోషన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రాన్ని ఒకప్పటి ప్రముఖ హీరోయిన్ జ్యోతిక 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించింది. 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా 60 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసి దర్శనిర్మాతలకి లాభాలు తెచ్చిపెట్టింది.
అయితే సత్యం సుందరం చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రం ఓటీటి హక్కులను ప్రముఖ ఓటీటి నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. దీంతో అక్టోబర్ 25 నుంచి సత్యం సుందరం చిత్రం నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది.
ఈ విషయం ఇలా ఉండగా హీరో కార్తీ ప్రస్తుతం సత్యం సుందరం చిత్ర సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. దీంతో వచ్చే ఏడాది ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు పి.ఎస్ మిత్రన్ తెరకెక్కిస్తున్న సర్దార్ 2 చిత్ర షూటింగ్ లో పాల్గొంటాడు. అయితే గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సర్ధార్ చిత్రం మంచి హిట్ అయ్యింది. దీంతో ఈ ఈ చిత్రానికి సీక్వెల్ గా సర్ధార్ 2 చిత్రాన్ని పి. ఎస్ మిత్రన్ తెరకెక్కిస్తున్నాడు