యాదగిరిగుట్టకు ‘కార్తీక’ శోభ

యాదగిరిగుట్టకు ‘కార్తీక’ శోభ

యాదగిరిగుట్ట, వెలుగు :  చివరి కార్తీక సోమవారం కావడంతో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. గుట్టపై ఎక్కడ చూసినా భక్తులే కనిపించారు. కల్యాణకట్ట, పుష్కరిణి, పార్కింగ్ ఏరియా, బస్ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు, ప్రధానాలయం భక్తులతో కిటకిటలాడాయి. లక్ష్మీనరసింహుల నిత్యకల్యాణం, సుదర్శన నారసింహ హోమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సువర్ణపుష్పార్చన, అభిషేకం, అర్చన నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.

సోమవారం ఒక్కరోజే 855 మంది వ్రత పూజలు జరిపించుకున్నారు. వ్రతాల ద్వారా ఆలయానికి రూ.6.84 లక్షల ఆదాయం వచ్చింది. పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాలతో ఆలయానికి రూ.41,98,656 సమకూరింది. అత్యధికంగా ప్రసాద విక్రయంతో రూ.13,83,810, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.5.50 లక్షలు, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.2,16,500, బ్రేక్ దర్శనాల ద్వారా రూ.1,09,200, వీఐపీ దర్శనాలతో రూ.1.05 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు తెలిపారు.