తిరుమలలో కార్తికేయ 2 మూవీ టీమ్

తిరుమలలో కార్తికేయ 2 మూవీ టీమ్

తిరుపతి: కార్తికేయ 2 మూవీ టీమ్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఉదయం విఐపీ దర్శన సమయంలో హీరో నిఖిల్, దర్శకుడు చందు ,నిర్మాత అభిషేక్ అగర్వాల్, నటుడు శ్రీనివాస్ రెడ్డి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్నారు. 
తిరుమలకు వచ్చిన టీమ్ సభ్యులకు ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. కార్తికేయ 2 సినిమా విడుదలై మంచి విజయం సాధించటంతో స్వామివారిని దర్శించుకున్నామని చిత్ర యూనిట్ తెలిపింది. కార్తికేయ 2 సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని హీరో నిఖిల్ చెప్పారు. సినిమా విజయవంతం కావడంతో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నామని తెలిపారు.