బెదురులంక 2012.. ఇండిపెండెన్స్ డేకి ట్రైలర్

బెదురులంక 2012..  ఇండిపెండెన్స్ డేకి ట్రైలర్

కార్తికేయ, నేహాశెట్టి జంటగా క్లాక్స్ దర్శకత్వంలో రూపొందిన  చిత్రం ‘బెదురులంక 2012’.  రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించారు. 2012 యుగాంత ప్రచారం బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కిన  ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. 

ఇప్పటికే వచ్చిన పాటలు, టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంగళవారం ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు.  ‘ఇది  గోదావరి బేస్డ్ రూరల్ డ్రామా.  ప్రేక్షకుల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లడంతో పాటు  ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు  దర్శక నిర్మాతలు. 

అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కశిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, రామ్ ప్రసాద్, గోపరాజు రమణ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.