OTTUpdate: థియేటర్ రిలీజ్ లేకుండానే.. నేరుగా ఓటీటీలోకి కార్తి కొత్త మూవీ

OTTUpdate: థియేటర్ రిలీజ్ లేకుండానే.. నేరుగా ఓటీటీలోకి కార్తి కొత్త మూవీ

తమిళ స్టార్ హీరో కార్తి హీరోగా నటించిన రీసెంట్ తమిళ మూవీ ‘వా వాతియార్’ (తెలుగులో ‘అన్నగారు వస్తారు’). ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మించారు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది.

పొంగల్ కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌ను అందుకుంది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది. ఈ క్రమంలోనే నెలరోజుల లోపే ‘అన్నగారు వస్తారు’ ఓటీటీ విడుదలపై అప్డేట్ వచ్చింది. 

బుధవారం, జనవరి 28 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, సంస్థ ఓ ప్రత్యేక పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు.

వాస్తవానికి ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదల కావాల్సి ఉండగా, ఆర్థిక వివాదాల కారణంగా వాయిదా పడింది. చివరకు జనవరి 14న తమిళంలో మాత్రమే విడుదలై, తెలుగు వెర్షన్ థియేటర్లలో విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమవ్వడంతో, ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన దక్కించుకుంటుందో చూడాల్సి ఉంది.