
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) డేటింగ్ రూమర్స్ మరోసారి ఊపందుకున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్తో (Kartik Aaryan) కొంతకాలంగా శ్రీలీల డేటింగ్లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరిమధ్య బలమైన బంధం ఉందనే టాక్ మరోసారి సోషల్ మీడియాలో కోడై కూస్తుంది. అందుకు కారణం లేకపోలేదు.. పలుమార్లు వీరిద్దరూ కలిసి ఈవెంట్స్, పార్టీస్, ఫెస్టివల్స్ వంటివి సెలబ్రేట్ చేసుకోవడమే కన్ఫమ్ అనేలా చేస్తున్నాయి.
లేటెస్ట్ విషయానికి వస్తే.. ఇటీవలే ముంబైలోని కార్తిక్ ఆర్యన్ ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ ఉత్సవాల సందర్భంగా శ్రీలీలతో పాటు ఆమె తల్లి కూడా అటెండ్ అయ్యింది. ఈ క్రమంలోనే శ్రీలీల-కార్తీక్ కలిసి చవితి సెలబ్రేట్ చేసుకోవడం మరిసారి కొత్త సందేహాలు రేకెత్తిస్తోన్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన అనేక ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి.
వైరల్ అవుతున్న ఫొటోల్లో.. శ్రీలీల-కార్తీక్ ఇద్దరూ ఒకేరకమైన వైట్ డ్రెస్లో కనిపించడం ఆసక్తి కలిగిస్తుంది. అలా ఒక ఫోటోలో కార్తీక్, శ్రీలీల తల్లి పక్కన పోజులివ్వగా, మరొక ఫోటోలో కార్తీక్ తల్లి మాలా తివారీ పక్కన శ్రీలీల నిలబడి ఉంది. ఇకపోతే, అంతకుముందు, కార్తీక్ మరియు శ్రీలీల కలిసి గణేష్ చతుర్థి పండల్‌ను సందర్శించడం విశేషం.
ఇదిలా ఉంటే.. ఇటీవలే కార్తిక్ ఆర్యన్ సిస్టర్ డాక్టర్ పట్టా అందుకున్న సందర్భంగా కార్తిక్ ఇంట్లో చిన్న పార్టీ చేసుకున్నారు. ఇందులో కార్తిక్ ఫ్యామిలీతో పాటు శ్రీలీల కూడా కనిపించి ఆశ్చర్యపరిచింది. అలానే కార్తీక్ తల్లి మాలా తివారీ తన కొడుకు కార్తీక్ ఆర్యన్తో కలిసి (IIFA అవార్డ్స్ 2025) వేడుకకి వెళ్లారు.
ఆ ఈవెంట్లో కార్తీక్ తల్లి మాలా తివారీ మాట్లాడుతూ 'కార్తీక్ భార్యగా.. మా ఫ్యామిలీ అంతా 'చాలా మంచి డాక్టర్'ని కోరుకుంటున్నట్లు ఆమె సరదాగా అన్నారు. అప్పుడే కార్తీక్ ఆర్యన్తో శ్రీలీల డేటింగ్ రూమర్స్ కన్ఫమ్ అయినట్లు టాక్ వినిపించింది. ఇలా పలుమార్లు శ్రీలీల డేటింగ్ రూమర్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. మరి క్లారిటీ ఎప్పుడొస్తుందనేది మాత్రం సస్పెన్స్గా మారింది.
ప్రస్తుతం శ్రీలీల తెలుగులో వరుస సినిమాలు చేస్తూనే బాలీవుడ్, కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో కార్తీక్ ఆర్యన్‌తో తన ఫస్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఇందులో కార్తీక్ ఆర్యన్ సింగర్‌గా నటిస్తుంటే, తన లవర్ పాత్రలో శ్రీలీల నటిస్తుంది. అనురాగ్ బసు రూపొందిస్తున్న ఈ మూవీని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్ నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ మూవీ రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. మరోవైపు సైఫ్ ఆలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్‌తోనూ మరో హిందీ మూవీకి శ్రీలీల కమిట్ అయ్యిందని టాక్.