కసబ్ను చూసి ఉగ్రవాది అనుకోలేదు.. అతనికి మాత్రం బిర్యానీ పెట్టలేదు

కసబ్ను చూసి ఉగ్రవాది అనుకోలేదు.. అతనికి మాత్రం బిర్యానీ పెట్టలేదు

26/11ఉగ్రదాడిలో ప్రధాన నిందితుడైన అజ్మల్ కసబ్కు పూణె ఎర్రవాడ జైలులో బిర్యానీ తినిపించారా..? ఈ ప్రశ్నపై  గత కొన్నేళ్లగా దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఈ ప్రశ్నకు మహారాష్ట్ర కేడర్ మాజీ ఐపీఎస్ అధికారి మీరన్ బోర్వంకర్ సమాధానం ఇచ్చారు. కసబ్ పై దేశ ప్రజల్లో లేవనెత్తిన ప్రశ్నలన్నింటికి ఆమె తన కమిషనర్ మేడమ్ అనే పుస్తకంలో సమాధానాలు చెప్పారు. 

బిర్యానీ ఇచ్చారా లేదా..?

పూణెలోని ఎర్రవాడ జైలులో కసబ్ ఉన్న సమయంలో అతనికి బిర్యానీ తినిపించలేదని మాజీ ఐపీఎస్ అధికారి మీరన్ బోర్వంకర్ స్పష్టం చేశారు. అతన్ని పట్టుకున్న సమయం నుంచి..ఉరితీసే వరకు ఒక్కసారి కూడా అతనికి బిర్యానీ ఇవ్వలేదన్నారు.  కసబ్ రోజూ వ్యాయామం చేసేవాడని పేర్కొన్నారు. అందుకే అతను చిన్నపిల్లాడిలా ఉండేవాడని తన పుస్తకంలో రాసుకొచ్చారు. కసబ్ ను ప్రశ్నలు అడిగిన సమయంలో అతను నవ్వుతూ ఉండేవాడని..కసబ్ గురించి జైలుతో సహా ఇతర అధికారులు తప్పుడు కథనాలు ప్రచారం చేసారని పుస్తకంలో చెప్పారు. అతన్ని పట్టుకున్నప్పటి నుంచి ఉరితీసే వరకు భారత ప్రభుత్వం చట్టానికి అనుగుణంగా కార్యక్రమాన్ని పూర్తి చేసిందని మీరన్ బోర్వంకర్ వెల్లడించారు. 

ప్లాన్ లీకయింది..

అజ్మల్ కసబ్ ను ముంబై నుంచి పూణేకు తీసుకువస్తుండగా..పలువురు అధికారుల ఫోన్లు లాక్కున్నానని మీరా బోర్వంకర్ తన పుస్తకంలో రాశారు. దీంతో కొందరు అధికారులు తనపై ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు. కసబ్ ను పూణేకు తీసుకువస్తున్నట్లు కేవలం పది మందికి మాత్రమే తెలుసన్నారు. అయితే ఈ విషయం లీక్ కావడంపై తాను షాక్ అయ్యాయన్నారు. 

ఉరి ఇలా జరిగింది..చిన్నపిల్లాడిలా అనిపించాడు..

అజ్మల్ ను ఉరితీసి ముందురోజు తాను ఎర్రవాడ జైలుకు వెళ్లానని మీరో బోర్వంకర్ తన పుస్తకంలో వెల్లడించారు. ఆ సమయంలో తాను యూనిఫాంకు బదులు బ్లేజర్ ధరించినట్లు తెలిపారు. ఎర్రవాడ జైలులో 30 ఏండ్ల తర్వాత ఒక ఖైదీని ఉరితీయాల్సి ఉన్న నేపథ్యంలో..జైలులో భద్రత కట్టుదిట్టం చేశారన్నారు. ఉరితీసే ముందు రోజు వరకు కసబ్ తనకు చిన్న పిల్లాడిలా కనిపించాడని చెప్పారు. ఈ పిల్లవాడు ఇంత పెద్ద ఉగ్రవాది అంటే తాను నమ్మలేకపోయానన్నారు. ఉరితీసినప్పుడు తాను అప్పటి హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్ కు ఫోన్ చేసి సమాచారం అందించానని వివరించారు. 

ALSO READ : బీజేపీ ఫస్ట్ లిస్టులో నా పేరు కచ్చితంగా ఉంటుంది: రాజాసింగ్

26/11 ఉగ్రవాద దాడుల నిందితుడైన ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు ముంబై జైలులో బిర్యానీ తినిపించారా? ఈ ప్రశ్న గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా తలెత్తుతోంది. ఈ విషయంలో కాంగ్రెస్ బుజ్జగింపులకు పాల్పడుతోందని బీజేపీ కూడా ఆరోపిస్తోంది. అయితే ఇప్పుడు మహారాష్ట్ర కేడర్ మాజీ ఐపీఎస్ అధికారి మీరన్ బోర్వంకర్ కసబ్‌కు శిక్షపై లేవనెత్తిన ప్రశ్నలన్నింటినీ తన 'కమీషనర్ మేడమ్' పుస్తకంలో ఆవిష్కరించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌పై కూడా మీరన్ తన పుస్తకంలో సంచలన ఆరోపణలు చేశారు. రాణి ముఖర్జీ నటించిన ‘మర్దానీ’ సినిమాలోని పాత్ర కూడా ఐపీఎస్ బోర్వంకర్ ఆధారంగా రూపొందడం గమనార్హం.