
విశ్వంత్ దుద్దుంపూడి, శ్రీజిత ఘోష్, శుభ శ్రీ హీరో హీరోయిన్లుగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో దండమూడి అవనీంద్ర కుమార్ నిర్మిస్తోన్న చిత్రం ‘కథ వెనుక కథ’. ఈ మూవీ టైటిల్ లాంచ్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గురువారం ప్రసాద్ ల్యాబ్స్‌లో మురళీ మోహన్ విడుదల చేసి టీమ్‌కి బెస్ట్ విషెస్ చెప్పారు.
హీరో విశ్వంత్ మాట్లాడుతూ ‘ఈ టైటిల్ వెనుక ఎన్నో కథలున్నాయి. అలాగే అందరి జీవితాల్లోనూ కథలుంటాయి. మా నిర్మాత వెనుకున్న కథ ఎందరికో స్ఫూర్తి’ అన్నాడు. తమకీ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పారు హీరోయిన్స్. ప్రతి ఒక్కరూ తనకు సపోర్ట్‌గా నిలిచారన్నాడు కృష్ణచైతన్య. ఈ సినిమాలోని ట్విస్టులు ప్రేక్షకులకు నచ్చుతాయన్నారు అవనీంద్ర కుమార్. ఇందులో నటించిన సునీల్, అలీ, రఘుబాబు, బెనర్జీ తదితరులు కార్యక్రమంలో పాల్గొని సినిమా సక్సెస్ సాధించాలని కోరారు.