
కొద్ది రోజులుగా బాలీవుడ్‌లోనే కాదు.. దేశమంతటా వినిపిస్తున్న పేర్లు రెండే రెండు.. కత్రినా కైఫ్, విక్కీ కౌషల్. ఈ బ్యూటిఫుల్ యాక్ట్రెస్‌కి, ఆ నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్‌కి పెళ్లి జరగబోతోందనే వార్త నిజమయ్యింది. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో వీరి వివాహం నిన్న ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అతి కొద్దిమంది సన్నిహితుల మధ్య ఈ జంట ఒక్కటయ్యింది. విక్కీ, కత్రినా ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. కొన్ని యాడ్స్‌కి మాత్రమే కలిసి వర్క్ చేశారు. ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకున్నారు. అందమైన ఈ జంట కలకాలం సంతోషంగా ఉండాలంటూ ఇద్దరి అభిమానులూ తమ విషెస్‌తో సోషల్ మీడియాని నింపేస్తున్నారు.