Katy Perry Trudeau: పార్కులో మాజీ ప్రధానితో పాప్ సింగర్ రొమాన్స్.. పబ్లిక్‌లోనే కిస్సులతో రెచ్చిపోయిన జంట..!

Katy Perry Trudeau: పార్కులో మాజీ ప్రధానితో పాప్ సింగర్ రొమాన్స్.. పబ్లిక్‌లోనే కిస్సులతో రెచ్చిపోయిన జంట..!

అమెరికన్ పాప్ స్టార్ సింగర్ కేటీ పెర్రీ, కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి వార్తల్లో నిలిచారు. వీరిద్దరి మధ్య ప్రేమ మరింత బలపడిందని తాజా ఫొటోలు, వీడియోలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ జంట ప్రపంచ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇటీవల కాలిఫోర్నియాలోని ఓ పార్కులో పిక్నిక్ సందర్భంగా కేటీ పెర్రీ, జస్టిన్ ట్రూడో ప్రేమగా కౌగిలించుకుంటూ ముద్దులు పెట్టుకున్నారు. పార్కులో పరుపు పరచుకుని విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఒకరినొకరు ఆప్యాయంగా హాగ్ చేసుకుంటూ రొమాంటిక్ కిస్సులతో రెచ్చిపోయారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ క్రమంలో వీడియోలు చూసిన నెటిజన్లు భిన్నమైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.ఈ జంట వీడియోలు కొంతమందిని ఆకర్షిస్తుంటే, మరికొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ప్రముఖ స్థాయిలో ఉన్నవాళ్లు ఇలా పబ్లిక్ ప్లేస్లో పిచ్చి రొమాన్స్ ఏంటనీ ప్రశ్నిస్తున్నారు. 

ఇకపోతే, ఈ పిక్నిక్‌కు కేటీ పెర్రీ ఐదేళ్ల కుమార్తె డైసీ కూడా హాజరైంది. డైసీ ఆమె మాజీ భర్త, హాలీవుడ్ నటుడు ఆర్లాండో బ్లూమ్‌తో కలిగిన కుమార్తె. అనంతరం అందరూ కలిసి భోజనం చేసి, పాతకాలపు జీప్ తరహా వాహనంలో అక్కడి నుంచి బయలుదేరారు. ఆ వాహనాన్ని కేటీ పెర్రీ స్వయంగా నడిపింది.

2025 నుంచి డేటింగ్‌..

2025 నుంచి డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఇటీవల ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్‌లో తొలిసారి కలిసి రెడ్ కార్పెట్‌పై కనిపించింది. ఈ తాజా రొమాంటిక్ ఫోటోలతో వీరి ప్రేమ వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలో భారీ చర్చకు దారితీసింది. 41 ఏళ్ల కేటీ పెర్రీ, 54 ఏళ్ల జస్టిన్ ట్రూడో పెళ్లి వార్తలు కూడా త్వరలోనే రానున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 

ప్రేమ ఎక్కడ మొదలైంది..

2025 జూలైలో కెనడాలోని మాంట్రియల్ నగరంలోని "లె వియోలన్" రెస్టారెంట్‌లో కేటీ పెర్రీ, జస్టిన్ ట్రూడో కలిసి భోజనం చేస్తూ కనిపించడంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందనే వార్తలు మొదలయ్యాయి. ఆ సమయంలో కేటీ పెర్రీ తన "లైఫ్‌టైమ్స్" టూర్ కోసం అక్కడికి వెళ్లింది. అంతకుముందే, దాదాపు పదేళ్ల పాటు కొనసాగిన తన నిశ్చితార్థ బంధాన్ని నటుడు ఆర్లాండో బ్లూమ్‌తో ముగించుకున్నట్లు కేటీ పెర్రీ అధికారికంగా ప్రకటించింది. అనంతరం కాలిఫోర్నియా తీరంలో ఓ యాట్‌లో విహారయాత్ర సందర్భంగా కేటీ పెర్రీ, జస్టిన్ ట్రూడో కలిసి సన్నిహితంగా కనిపించడంతో వారి లవ్ స్టోరీ అధికారికంగా ధృవీకరించబడింది.

ప్రియురాలికోసం పక్క దేశానికి..

ఇక ఇటీవల ఫిఫా వరల్డ్ కప్‌లో అమెరికా మ్యాచ్‌కు హాజరై షాక్ ఇచ్చారు. తన గర్ల్‌ఫ్రెండ్‌ కేటీ పెర్రీతో కలిసి అమెరికా - పరాగ్వే మ్యాచ్‌ను ఆయన వీక్షించారు. ఓ దేశ మాజీ ప్రధాని ఇంకో దేశంలో.. అందునా సొంత దేశం ఆడుతున్న మ్యాచ్ ను చూడకుండా ప్రియురాలికోసం పక్క దేశం మ్యాచ్ చూసేందుకు రావడం కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇక ఇప్పుడు రొమాంటిక్ కిస్సెస్ తో మరోసారి హాట్ టాపిక్ గా మారింది ఈ జంట. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by WAS (@was)