కవిత తొలిరోజు ఈడీ విచారణ పూర్తి ములాఖత్‪తో కలిసిన హరీశ్, కేటీఆర్

 కవిత తొలిరోజు ఈడీ విచారణ పూర్తి ములాఖత్‪తో కలిసిన హరీశ్, కేటీఆర్

లిక్కర్ స్కాం కేసులో రిమాండ్ లో ఉన్న కవిత ఈరోజు తొలిసారిగా ఈడీ విచారణ ఎదుర్కొంది. కవితపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. కవిత వాటిలో కొన్నింటికి సమాధానాలు చెప్పగా.. మరి కొన్ని ప్రశ్నలకు మౌనం వహించింది. ఆమ్ అద్మీ పార్టీకి ఇచ్చిన వంద కోట్లు ఏలా వచ్చాయని, లిక్కర్ పాలసీ ద్వారా సంపాధించిన రూ.192 కోట్ల గురించి ఆధారాలు చూపించి అధికారులు ఆమెను ప్రశ్నించారు. ఇంకా ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారని ఈడీ ఆఫీసర్స్ ఆరాతీశారు.

విచారణను ఈడీ అధికారులు వీడియో రికార్డ్ చేశారు.  విచారణ అనంతరం కేటీఆర్, హరీష్ రావు ములాఖత్ తీసుకొని ఈడీ ఆఫీస్ లో కవితను కలిశారు. వారితోపాటు కవిత లాయర్ మోహిత్ రావు కూడా ఉన్నారు. సుప్రీం కోర్టులో  కేసు పెండింగ్ లో ఉండగా ఈడీ కవితను అరెస్ట్ చేయడాన్ని సవాల్  చేస్తూ ఆమె భర్త అనిల్ రేపు సుప్రీం కోర్టులో కంటెప్ట్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.