డేటాను షేర్​ చేయడానికి ఒప్పుకుంటే డబ్బులిస్తామంటున్న కేడెన్

డేటాను షేర్​ చేయడానికి ఒప్పుకుంటే డబ్బులిస్తామంటున్న కేడెన్

న్యూఢిల్లీ: ఫోన్​లోని డేటాను షేర్​ చేయడానికి ఒప్పుకుంటే డబ్బులిస్తామని చెబుతోంది కేడెన్​ అనే స్టార్టప్​.  ఇచ్చే డేటా సైజును బట్టి డబ్బును డాలర్లలో చెల్లిస్తామని చెబుతోంది. ముఖ్యంగా కస్టమర్​షాపింగ్ సమాచారం​, వాళ్లు చూసే కంటెంట్​ వివరాలను ఇది తీసుకుంటుంది. ఉదాహరణకు మన ఫోన్​లో అమెజాన్​ యాప్​ ఉంటే అందులోని సమాచారాన్ని కేడెన్​ వాల్ట్​లోకి తీసుకొని షేర్​ చేసుకుంటుంది. ఈ డేటాను అడ్వర్టైజింగ్​ అవసరాల కోసం వాడుకుంటామని, ఇలా వచ్చిన దాంట్లో కొంతమొత్తాన్ని కస్టమర్​కు చెల్లిస్తామని కేడెన్​ తెలిపింది.

సాధారణ పద్ధతుల్లో కస్టమర్​ నుంచి డేటా తీసుకోవడం డిజిటల్​ మార్కెటింగ్​ కంపెనీలకు కష్టంగా మారింది. ప్రతి దానికీ పర్మిషన్లు అవసరం అవుతున్నాయి. అందుకే కంపెనీలు ఇలాంటి మార్గాల్లో డేటాను తీసుకుంటున్నాయి. వచ్చే ఏడాది నుంచి పది వేల మంది యూజర్ల గ్రూపుతో పబ్లిక్​ బీటా టెస్టింగ్​ మొదలుపెడతామని కేడెన్​ ప్రకటించింది. షేర్​ చేసే డేటాను బట్టి నెలకు 5–50 డాలర్ల వరకు చెల్లిస్తామని ప్రకటించింది. కస్టమర్​డేటా స్కోర్​ను బట్టి చెల్లించే మొత్తం ఉంటుందని తెలిపింది. ఈ కంపెనీకి గత నెల ఆరు మిలియన్​ డాలర్ల ఫండింగ్​ వచ్చింది.