మధ్యాహ్నం కేసీఆర్ కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే..

మధ్యాహ్నం కేసీఆర్ కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే..

క్యాంప్ ఆఫీసులో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. ఇందులో దళిత బంధు పథకం విధివిధానాలు ఖరారు చేయనున్నారు. కృష్ణా, గోదావరి నది యాజమాన్యాల బోర్డుల పరిధి ఖరారు చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్ పై మంత్రులు చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వర్షాలు, వరద నిర్వహణ బృందం ఏర్పాటు, పంటలకు సాగు నీరు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, దళిత బీమా, చేనేత బీమాపై మంత్రులు చర్చించనున్నారు. 

కరోనా థర్డ్ వేవ్‌పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మందులు, బెడ్స్ అందుబాటులో ఉంచడంపై డిస్కస్ చేయనుంది కేబినెట్. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఆయిల్ పాం సాగుపై కేబినెట్ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల లెక్కలను మంత్రివర్గం ముందు ఉంచనుంది ఆర్థిక శాఖ. మరోవైపు హుజురాబాద్ ఉప ఎన్నిక ఉండడంతో రాజకీయ అంశాలపై కేబినెట్ మీటింగ్‌లో చర్చిస్తారని సమాచారం.