చంద్రబాబుపై మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చేనేత ఆత్మహత్యలపై సిరిసిల్ల బీఆర్ఎస్ మాట్లాడిన కేసీఆర్.. భూదాన్ పోచంపల్లిలో ఒకే రోజు ఏడుగురు నేతన్నలు ఆత్మహత్య చేసుకుంటే వారికి రూ.50వేలు పరిహారం ఇవ్వాలని ఆనాటి సీఎం చంద్రబాబును కోరానని అన్నారు. ఆ దుర్మార్గుడు, మూర్ఖుడు పట్టించుకోలేదని చెప్పారు. అప్పుడు తాను భిక్షాటన చేసి రూ.7.50 లక్షలు ఆ కుటుంబాలకు అందజేశానని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక నేతన్నలకు ఎన్నో స్కీంలు తెచ్చామని చెప్పుకొచ్చారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం సిరిసిల్ల నేతన్నలను ఆదుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. సిరిసిల్లలో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెబితే.. పోయేదేముంది వాళ్లను నిరోద్ లు అమ్ముకొని బతకమని ఓ కాంగ్రెస్ నాయకుడు అంటున్నాడని.. బీఆర్ఎస్ హయాంలో చేనేత కార్మికులు దొబ్బి తిన్నారని అంటారా మీరు మనుషులా? లక్షలాది మంది కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా?' అని కేసీఆర్ ఫైరయ్యారు.