జీ 20 సదస్సుపై రాష్ట్రపతి భవన్​లో ఆల్​ పార్టీ సమావేశం

జీ 20 సదస్సుపై రాష్ట్రపతి భవన్​లో ఆల్​ పార్టీ సమావేశం
  • జీ 20 సదస్సుపై రాష్ట్రపతి భవన్​లో ఆల్​ పార్టీ సమావేశం
  • ఖర్గే, మమతా బెనర్జీ, కేజ్రీవాల్, స్టాలిన్, జగన్, చంద్రబాబు తదితరులు హాజరు
  • ప్రగతిభవన్ కే పరిమితమైన టీఆర్ఎస్ చీఫ్

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ కీలక మీటింగ్​లకు సీఎం కేసీఆర్​ వరుసగా డుమ్మాలు కొడుతున్నారు. జీ- 20 సదస్సు నిర్వహణపై సోమవారం మోడీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఆల్​పార్టీ మీటింగ్​కు కూడా వెళ్లలేదు. వచ్చే ఏడాది సెప్టెంబర్​ 9, 10 తేదీల్లో ఢిల్లీలో జరిగే ‘జీ 20 కాన్ఫరెన్స్’​కు మన దేశం అధ్యక్షత వహిస్తుండగా..20 దేశాలు పాల్గొన్నాయి. ప్రతిష్టాత్మకమైన కాన్ఫరెన్స్​ను ఎలా నిర్వహించాలనే దానిపై సలహాలు, సూచనల కోసం కేంద్ర ప్రభుత్వం ఆల్​ పార్టీ మీటింగ్​ను ఏర్పాటు చేసి..40 రాజకీయ పార్టీల ప్రతినిధులను ఆహ్వానించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పడని రాజకీయ పార్టీల అధ్యక్షులు కూడా వచ్చారు. కానీ, టీఆర్​ఎస్​ చీఫ్​ కేసీఆర్​ మాత్రం వెళ్లలేదు. సోమవారం ఉదయం నుంచి ప్రగతి భవన్​లోనే  ఉన్నారు. సీబీఐ నుంచి కవితకు నోటీసులు రావడంపై న్యాయ నిపుణులతో చర్చించారు. రాష్ట్రంలోని మంత్రులు, ముఖ్యులపై ఐటీ దాడులు జరగడం, కవితపై ఢిల్లీ లిక్కర్​ కేసు ఉచ్చు బిగిస్తుండటంతోనే ఆల్​ పార్టీ మీటింగ్​కు కేసీఆర్ దూరంగా ఉన్నారనే చర్చ జరుగుతున్నది.

వాస్తవానికి గతేడాది నుంచి కేసీఆర్​ కేంద్ర కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మోడీ రాష్ట్రానికి వచ్చినా.. ఢిల్లీలో కేంద్రం ఏదైనా సమావేశం పెట్టినా వెళ్లడం లేదు. నీతి ఆయోగ్​ మీటింగ్​ను బాయ్​కాట్​ చేస్తున్నట్లు మీడియా సమావేశంలోనే గతంలో సీఎం ప్రకటించారు.మంత్రులు కూడా ఏదైనా అవార్డు తీసుకోవడానికి ఢిల్లీ వెళ్తున్నారు తప్పితే..అక్కడ ముఖ్యమైన మీటింగ్​లకు పోవడం లేదు. మీటింగ్​కు  టీఎంసీ చీఫ్​ మమతా బెనర్జీ, బీజేడీ చీఫ్​ నవీన్ పట్నాయక్, ఆప్​ చీఫ్​ కేజ్రీవాల్, వైసీపీ చీఫ్​ జగన్ మోహన్ రెడ్డి, డీఎంకే చీఫ్​ స్టాలిన్, కాంగ్రెస్ చీఫ్​ మల్లికార్జున్ ఖర్గే, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, టీడీపీ చీఫ్​ చంద్రబాబు తదితరులు తదితరులు హాజరయ్యారు.