పాలమూరు ప్రాజెక్టు నిర్మించాలని కేసీఆర్ కు లేదు

పాలమూరు ప్రాజెక్టు నిర్మించాలని కేసీఆర్ కు లేదు

ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏమీ మాట్లాడలేదని ఆరోపించారు బీజేపీ జాతీయ ఉపాద్యక్షురాలు డీకే అరుణ. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టునే ఇంతవరకు పూర్తి చేయలేదన్నారు. అసలు ఆ ప్రాజెక్టును నిర్మించాలని ఆయనకు లేదన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రజలపైన కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీళ్లు తరలించుకుపోతుంటే ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు కేసీఆర్ కొత్తనాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ రహస్యం లేకపోతే ప్రాజెక్టుల DPR లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దొంగలు దొంగలు కలిసినట్టు కాంట్రాక్టర్లతో జతకట్టి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు.30000 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష కోట్లపైగా వ్యయం పెంచారన్నారు. ఇలా ప్రాజెక్టుల వ్యయం పెంచుకుంటూ..అప్పులు తెచ్చి మరీ కేసీఆర్ దోచుకుంటున్నారని విమర్శించారు.ఏపీ సీఎం జగన్ తో కేసీఆర్ లోపాయకారి ఒప్పందాలు కుదుర్చుకుంటూ…కేంద్ర ప్రభుత్వంపై పనికి మాలిన ఆరోపణలు చేస్తున్నారన్నారు డీకే అరుణ.