సారు కేసీఆర్ కిట్ పైసల్ పడలే.. సాఫ్ట్వేర్ సమస్య..నేను చూస్తాంటూ మంత్రి ఎర్రబెల్లి ఆన్సర్

సారు కేసీఆర్ కిట్ పైసల్ పడలే.. సాఫ్ట్వేర్ సమస్య..నేను చూస్తాంటూ మంత్రి ఎర్రబెల్లి ఆన్సర్

మంత్రి సార్..మాకు కేసీఆర్ కిట్ పైసలు పడలేదు..ఎందుకు అని అడిగితే..అందుకు ఆయన సమాధానం ఏంటో తెలుసా..సాఫ్ట్ వేర్ సమస్య వల్ల పడలేదట. డెలివరీ మూడేళ్లు దాటింది సారు..అయినా పడలేదంటూ నిలదీస్తే....అదేనమ్మ సాఫ్ట్ వేర్ సమస్య..దాని సంగతి నేను చూస్తాలే...అంటూ టాపిక్ డైవర్ట్. ఈ అద్భుతమైన వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు..మన మంత్రి వర్యులు..ఎర్రబెల్లి దయాకర్ రావు.    
 
జనగామ జిల్లా పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. పాలకుర్తి ప్రభుత్వాస్పత్రిలో మహిళా ఆరోగ్య కేంద్రాన్ని  ప్రారంభించారు. కేసిఆర్ కిట్ పథకంపై మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతుండగా.. మహిళలంతా .. కేసీఆర్ కిట్ డబ్బులు పడలేదని ప్రశ్నించారు. వెనకా ముందు పడతాయని దాటవేసే ప్రయత్నం చేశారు మంత్రి ఎర్రబెల్లి. అందరికీ వచ్చాయి..ఒకరిద్దరికి ఉంటే మిస్ కావచ్చని బుకాయించారు. కానీ  మహిళలు అందరూ ఎవరికి పడలేదు..డెలివరీ అయి మూడేళ్లయినా..ఇప్పటి వరకు కేసీఆర్ కిట్ పథకం పైసలు రాలేదని నిలదీశారు. దీంతో సాఫ్ట్ వేర్ ప్రాబ్లం ఉంటే రావు..ఆస్పత్రి ఉద్యోగులను అడిగి నేను చూస్తానంటూ దాటవేశారు. 

అసలు నిజం ఏంటంటే..బీఆర్ఎస్ ప్రభుత్వం గత మూడేళ్ల నుంచి కేసీఆర్ కిట్ పైసలు లబ్దిదారుల అకౌంట్లో జమ చేయలేదు. చివరి సారిగా 2020లో గర్బిణీల అకౌంట్లలో జమ చేయగా..ఆ తర్వాత కేసీఆర్ కిట్ పైసలు మాత్రం లబ్దిదారులకు వేయలేదు. కానీ ప్రభుత్వ పెద్దలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నాయకులు మాత్రం..కేసీఆర్ కిట్ పథకం కింద నగదు అందిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎందుకు పడటం లేదని నిలదీస్తే..ఇదిగో మంత్రి ఎర్రబెల్లి సాఫ్ట్ వేర్ సమస్య అంటూ దాటవేశారు. ఎక్కడైనా సాఫ్ట్ వేర్ సమస్య ఉంటే నాలుగు రోజులు..వారం రోజు..పోనీ నెల రోజులు పడుతుంది..కానీ ఏండ్లకు ఏండ్లు సాఫ్ట్ వేర్ సమస్యతో లబ్దిదారుల ఖాతాల్లో నిధులు జమ కావా..? అని లబ్దిదారులు ప్రశ్నిస్తున్నారు.