నెంబర్ వన్ 420 కేసీఆర్ : జీవన్ రెడ్డి

నెంబర్ వన్ 420  కేసీఆర్ : జీవన్ రెడ్డి

మాజీ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో నంబర్ వన్ 420 కేసీఆర్ అని విమర్శించారు. హైదరాబాద్ లోని సీఎల్పీ కార్యాలయంలో జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో చేసిన వాగ్దానాలే అమలు చేయడం ప్రామాణికం అయితే కేసీఆర్ పెద్ద 420 అవుతారని అన్నారు. మూడెకరాల భూమి ఇస్తానని దళితలును మోసం చేశారని ఆరోపించారు. 

కేసీఆర్ కమీషన్ వల్లే తెలంగాణ లక్షల కోట్ల అప్పుల్లో కూరుకు పోయిందని జీవన్ రెడ్డి అన్నారు. జ్యూడిషరీ ఎంక్వయిరీ పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు. "ఎమ్మెల్సీ కవితను లిక్కర్ స్కాంలో కాపాడినట్టే కేసీఆర్ ను కాపాడాలనుకుంటున్నావా కిషన్ రెడ్డి" అని ప్రశ్నించారు. ఎస్టీ రిజర్వేషన్లు, రాష్ట్ర పరిధిలో ఉన్న అంశంలో ఇందిరా సహాని కేసు అని చెప్పి కేసీఆర్ 8 ఏండ్లు కాలయాపన చేశారని ఫైర్ అయ్యారు.

  బీజేపీ కేంద్రంలో తెచ్చిన ప్రతి బిల్లుకు కేసీఆర్ మద్దతు ఇచ్చారని జీవన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ నుంచి తెలంగాణ ఎప్పుడైతే పోయిందో అప్పుడే తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించే హక్కు బీఆర్ఎస్ నాయకులు కోల్పోయారని విమర్శించారు.