కుర్చీపై పింక్ టవల్ వేసి కేసీఆర్ ఫొటో!

కుర్చీపై పింక్ టవల్ వేసి కేసీఆర్ ఫొటో!
  • నల్లగొండలో  కాంగ్రెస్ వినూన్న నిరసన
  • పదేండ్లలో ప్రాజెక్టులు కట్టలేదని ఆగ్రహం

నల్లగొండ: కుర్చీ వేసుకొని కూర్చొని కృష్ణా నది కింద ప్రాజెక్టులు కట్టిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ పదేండ్లుగా పట్టించుకోలేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఇవాళ క్లాక్ టవర్ చౌరస్తాలో ఓ కుర్చీ వేసి దానిపై పింక్ టవాల్ వేసి, కేసీఆర్ ఫొటో పెట్టి నిరసన తెలిపారు.  

బీఆర్ఎస్ పాలనలో నల్లగొండ జిల్లాకు పూర్తిగా అన్యాయం జరిగిందని వారు ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు సైతం ఏర్పాటు చేయడం గమనార్హం.  ఇవాళ మధ్యాహ్నం కేసీఆర్ మీటింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా మినీ సభ నిర్వహిస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలీసులు  పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.

Also Read:అందరూ బస్సెక్కారు!!.. కాకపోతే రూటే చేంజ్