నేడు కేసీఆర్ సమీక్ష సమావేశం

నేడు కేసీఆర్ సమీక్ష సమావేశం

మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరగనుంది. కరోనా కట్టడి, వానాకాలం పంటలు, లాక్ డౌన్ సడలింపులు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు, రాష్ట్ర అవతరణ వేడుకలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. అదేవిధంగా కరొనా వ్యాప్తి నివారణకు ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్ అమలుపై భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కొన్ని షాపులు ఒక రోజు.. మరికొన్ని షాపులు మరుసటి రోజు తెరుస్తున్నారు. మరికొంత కాలం ఇలాగే కొనసాగించాలా లేకపోతే ఏమైనా మార్పులు చేయాలా అనే విషయంపై చర్చించి సమీక్షలో నిర్ణయం తీసుకోనున్నారు. రోహిణి కార్తె ప్రారంభమైన నేపథ్యంలో.. వానాకాలం పంటలకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. గ్రామాల్లో ఎరువుల లభ్యత ఉందా? లేదా? విత్తనాలు అందుబాటులో ఉన్నాయా? లేవా? అనే విషయాలపై కీలకంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎలా జరపాలనే దానిపై కూడా సీఎం క్లారిటీ ఇవ్వనున్నారు.

For More News..

భూములు పాయే.. ప్రాజెక్ట్ పాయే.. కొలువులు కూడా రాకపాయే..

రూ. 170 కోసం దోస్తుల గొడవ.. ఒకరి మృతి

సర్పంచ్‌గా గెలిచి.. ఊరికి మంచి నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నానంటూ..