కేసీఆర్ అన్న మాటలకు ఏ కేసు పెట్టాలి: మంత్రి కొండా సురేఖ

కేసీఆర్ అన్న మాటలకు ఏ కేసు పెట్టాలి: మంత్రి కొండా సురేఖ

తుక్కుగూడ సభ నుంచి బీఆర్ఎస్‌ను తరిమి కొట్టాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. తుక్కుగూడ జనజాతర సభలో ఆమె హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖకు కేటీఆర్ నోటీసుల పంపిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. హీరోయిన్లను బ్లాక్‌మెయిల్ చేసినవ్ అని అన్నందుకే తనకు నోటీసులు పంపించావే.. కరీంనగర్ ప్రెస్ మీట్ కేసీఆర్ మాట్లాడిన మాటలపై ఏ కేసు పెట్టాలని మంత్రి ప్రశ్నించింది. ఆ సమయంలో కేటీఆర్ కూడా వేదికపైనే ఉన్నాడని చెప్పుకొచ్చారు. కుక్కల కొడుకుల్లారా అని ఎవరిని అన్నారని ఈ సందర్భంగా ఆమె ప్రశ్నించారు. 

తెలంగాణ మహిళలను కేసీఆర్ అలా తిట్టారని.. అలాంటి కేసీఆర్ పై ఏ కేసు పెట్టాలని కేటీఆర్‪ను ప్రశ్నించింది. కుక్కల కొడుకులు అని మాట్లాదినందుకు కేసీఆర్‌ను బహిరంగంగా ఉరితీసిన క్షమాపణ లేదని ఆమె అన్నారు. బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్న ఫ్రస్టేషన్ లో ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని ఆమె తెలిపింది. ప్రజల నమ్మకం నమ్మకం కోల్పోయి ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్నారని, మేము ప్రజల సంక్షేమం కోసం అధికారంలో ఉన్నామన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ఐదు గ్యారెంటీలు అమలు చేశామని ఆమె తెలిపారు. తొమ్మిదున్నర ఏళ్ల అహంకార పాలనకు చరమ గీతం పాడి ఇందిరమ్మ పాలన తెచ్చుకున్నామని మంత్రి వివరించారు.