- తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
వికారాబాద్, వెలుగు: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా దళిత వ్యక్తి ఉన్నందునే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం వికారాబాద్ లోని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ నివాసంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ధారాసింగ్, యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి సంతోష్ కుమార్‌తో కలిసి మాట్లాడారు. స్పీకర్ పై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆనంద్ అనుచిత వ్యాఖ్యలు సమంజసం కాదన్నారు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేసి బీఆర్ఎస్‌లో విలీనం చేసుకోలేదా? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఒక్కో ఎమ్మెల్యేను పిలిచి విచారణ జరిపి స్పీకర్ తగిన నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు చిగుర్లపల్లి రమేశ్‌కుమార్, రాజశేఖర్ రెడ్డి, సర్పరాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
