మీకు వారసత్వంగా వస్తే..మా భూములు ఎక్కడున్నాయి? : రమ్యారావు 

మీకు వారసత్వంగా వస్తే..మా భూములు ఎక్కడున్నాయి? : రమ్యారావు 
  • కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రశ్నించిన కేసీఆర్ ​అన్న కూతురు రమ్యారావు 
  • కవితను, నన్ను సంతోష్ రావు బయటకు పంపిస్తే మౌనంగా ఎందుకున్నావని నిలదీత  

హైదరాబాద్, వెలుగు: ‘చిన్నప్పటి నుంచే మాకు వందల ఎకరాల భూములు ఉన్నాయంటున్న కేటీఆర్.. ఆ భూములు ఎక్కడున్నాయో చెప్పాలి’ అని  కేసీఆర్​ అన్న కూతురు, కాంగ్రెస్​ నాయకురాలు రేగులపాటి రమ్యారావు సవాల్​ విసిరారు. సోమవారం గాంధీ భవన్ లో మీడియాతో ఆమె మాట్లాడారు. ‘మాకు తాతల నుంచి వందల ఎకరాలు వారసత్వంగా వచ్చాయని కేటీఆర్​ అంటున్నారు. కేటీఆర్.. నువ్వు రాఘవరావు మనువడివే. నేను ఆయన మనుమరాలినే.

అలాంటప్పుడు వారసత్వంగా మీకు భూములు వస్తే.. మాకు కూడా రావాలి కదా? మరి  ఆ వందల ఎకరాల్లో మా భూమి ఎక్కడుంది? ఎంత ఉంది? నువ్వే చెప్పాలి..’ అని కేటీఆర్​ను సూటిగా అడిగారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనకు జనంలో మద్దతు లభిస్తుంటే చూసి ఓర్వలేక 22 ఏను అడ్డంపెట్టుకొని రాజకీయాలు చేయడం మానుకోవాలని కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆమె హితవు పలికారు. ‘మన కుటుంబంతో సంబంధం లేని సంతోష్ రావు కేసీఆర్ వద్ద ఎందుకు ఉంటున్నాడు? ఆయన ఇటు కవితను, అటు నన్ను బయటకు పంపిస్తే.. నువ్వు ఎందుకు మౌనంగా ఉంటున్నావు? ’ అని ప్రశ్నించారు.

కరీంనగర్ లో సంతోష్ ఉన్నప్పుడు ఆయనకు చెప్పులు కూడా లేని పరిస్థితి ఉండేదని, ఇంట్లో పనిచేసే ఓ పనిపిల్ల వద్ద డబ్బులు గుంజుకొని పోయిన సంతోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుఇప్పుడు వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని నిలదీశారు. దుబాయ్ నుంచి నడిపిస్తున్న సోషల్ మీడియా ద్వారా రేవంత్ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై తప్పుడు ప్రచారం చేస్తూ, ప్రజలను కేటీఆర్​తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపించారు. ఉద్యమం ముసుగులో సంతోష్  అడ్డగోలుగా సంపాదించారని.. దేశ, విదేశాల్లో కూడా ఆస్తులు కూడబెట్టాడన్నారు. వీటన్నింటినీ ప్రభుత్వం బయటకు తీయకముందే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి, వాటిని ప్రభుత్వానికి అప్పగించాలని ఆమె డిమాండ్​ చేశారు.