
పరమశివుడి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉత్తరాఖండ్ లోని కేదార్‌నాథ్ ఆలయం తెరుచుకుంది. మే 2 వ తేదీ శుక్రవారం .. భజనలు, 'హర్ హర్ మహాదేవ్' కీర్తనల మధ్య ఆలయ తలుపులను అధికారులు తెరిచారు. ఈ సందర్భంగా పూల వర్షం కురిపించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్ నాథ్ అలయాన్ని సందర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.
కేదార్‌నాథ్ ధామ్ లో.. ఆదియోగి శివుడు ఇక్కడ నివసిస్తున్నాడని భక్తులు నమ్ముతుంటారు. 2025 సంవత్సరంలో, మే 2న కేదార్‌నాథ్ ధామ్ తలుపులు తెరుచుకుంటాయి. తలుపులు తెరవడానికి ముందు.. బాబా కేదార్ పంచముఖి విగ్రహాన్ని ఇక్కడకు తీసుకువచ్చారు. బాబా డోలీ యాత్ర 2025 ఏప్రిల్ 28న ప్రారంభమైంది.
బాబా కేదార్‌నాథ్ విగ్రహం డోలి యాత్ర ఏప్రిల్ 28న రుద్రప్రయాగ జిల్లాలోని ఉఖిమత్ లో ఓంకారేశ్వర్ ఆలయం నుంచి ఉదయం 10.30 గంటలకు పల్లకీలో ప్రారంభమైంది . కేదార్‌నాథ్ రాలేని వారు శీతాకాలంలో ఈ ప్రదేశంలో బాబా కేదార్‌నాథ్ దర్శనం చేసుకుంటారు. ఓంకారేశ్వర్ ఆలయం నుంచి ప్రారంభమైన డోలి యాత్ర గుప్త్కాషి.... ఫాటా ... గౌరికుండ్‌లలో రాత్రి బస చేసిన తర్వాత మే 1న కేదార్‌నాథ్ ధామ్ చేరుకుంది. డోలి కేదార్‌నాథ్ ధామ్ చేరుకోవడానికి 4 రోజులు పట్టింది.
Also Read : మీకు ఉద్యోగం, డబ్బు ఇచ్చేది శని దేవుడే
బాబా కేదార్‌నాథ్ ధామ్ తలుపులు వైశాఖ మాసం ఐదవ రోజున మే 2 వ తేదీన ఉదయం 7 గంటలకు తెరచుకుఉంది. 6 నెలల పాటు కేదార్‌నాథ్ ఆలయాన్ని ఓపెన్ చేసి ఉంచుతారు. కేథార్నాథ్ లో ఈ ఏడాది స్వామిని దర్శించుకునేందుకు కొత్త టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. గంటకు 1400 మంది దర్శనం చేసుకొనేవిధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు.
భక్తులకు సంగం వద్ద పది కౌంటర్లలో టోకెన్లు జారీ చేస్తున్నారని.. అధికారులు తెలిపారు. తరువాత 15 నిమిషాల తరువాత స్లాట్ ప్రకారం క్యూలైన్లలోకి అనుమతిస్తారు. స్వామి దర్శనానికి గంటల తరబడి క్యూలైన్లలో ఉండకుండా ఉండేలా పోలీసులు.. అధికారులు..ఇతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.