
నాలుగేళ్ల క్రితం ‘మహానటి’ చిత్రంతో ఇంప్రెస్ చేసిన కీర్తి సురేష్.. నటిగా తనకు ఆ స్థాయి పేరు తెచ్చే మరో సినిమా కోసం వరుస ప్రయత్నాలు చేస్తోంది. ఓ వైపు కమర్షియల్ మూవీస్ చేస్తూనే మరోవైపు ఉమెన్ సెంట్రిక్ సినిమాల్లోనూ నటిస్తోంది. ఇప్పటికే పెంగ్విన్, మిస్ ఇండియా లాంటి రెండు సినిమాలు వచ్చి నిరాశ పరచగా, రెండు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ‘గుడ్ లక్ సఖి’ ఈనెల 28న థియేటర్స్‌లో విడుదలవుతోంది. మరోవైపు తమిళ సినిమా ‘సాని కాయిదం’ కూడా రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో ఈ మూవీ రాబోతోంది. ఇందులో కిల్లర్ పాత్రలో డీగ్లామర్‌గా కనిపిస్తోంది కీర్తి. ఆమెతో పాటు దర్శకుడు సెల్వరాఘవన్ మరో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అరుణ్ మాదేశ్వరన్ దర్శకుడు. లాస్ట్ ఇయర్ ఆగస్టులోనే షూటింగ్ పూర్తయింది. గతంలో కీర్తి నటించిన ‘పెంగ్విన్’ మూవీని రిలీజ్ చేసిన అమెజాన్ ప్రైమ్ సంస్థ, త్వరలో ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.