కీసర తహశీల్దార్ నాగరాజు కేస్ రిమాండ్ రిపోర్ట్

కీసర తహశీల్దార్ నాగరాజు కేస్ రిమాండ్ రిపోర్ట్

హైదరాబాద్‌: రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు అవినీతి కేసుకు సంబంధించిన‌ రిమాండ్ రిపోర్ట్ ‌ను రెడీ చేసింది ఏసీబీ. శుక్ర‌వారం ఆ వివ‌రాలను వెల్ల‌డించింది ఏసీబీ. రాంపల్లి దయార వద్ద ఉన్న 19 ఎకరాల 39 గుంటల భూమిని ఒరిజినల్ పట్టదారులకు ఇప్పించేందుకు అంజిరెడ్డి మధ్య వర్తిత్వం చేశాడు. ఇందులో భాగంగా తహశీల్దార్ నాగరాజు కు రూ.1.1కోటి డీల్ కుదిర్చాడు. డబ్బు అరేంజ్ చేసిన శ్రీనాథ్ యాదవ్ అనే వ్యక్తి ఏర్పాటు చేశాడు. పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు దాడి చేశారు. అంజిరెడ్డికి చెందిన ఫార్చ్యూనర్ కార్, శ్రీనాథ్ వోక్స్ వాగన్ కార్‌ను సీజ్ చేశారు. అంజిరెడ్డి స్నేహితుడి ఇంట్లో కీసర తహసీల్దార్ డీల్ కుదుర్చుకున్నట్లు రిమాండ్ రిపోర్ట్ లో రాశారు. ఏసీబీ దాడి సమయంలో ఇంట్లో 4 నలుగురు నిందితులు ఉన్నారు. ఇంటి మొత్తాన్ని ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు.

పలు కేసుల ఎఫ్ఐఆర్ కాపీలు, కోర్ట్ ఆర్డర్ సంబంధించిన 65 పేజీల రెప్రజెంటేటివ్ లెటర్స్‌ను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. గుండ్ల పోచంపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన ఇళ్ల‌ అనుమతికై 204 పేజీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రాంపల్లిలో దయారా భూ పంచాయతీకి సంబంధించి ఆర్టీఐ నుండి సేకరించిన 105 పేజీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పలు కేసుల ఎఫ్ఐఆర్ కాపీలు, కోర్ట్ ఆర్డర్ కాపీలు 65 పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించి మూడు రోజుల పాటు ఏసీబీ విచారించింది. అయితే నిందితులు ఏసీబీకి సహకరించనట్లు తెలుస్తోంది. మరోసారి నిందితులను కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఏసీబీ కోర్టులో నిందితులు బెయిల్ పిటీషన్ ‌ను దాఖలు చేశారు.