చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ పట్టపగలే మోసం చేసింది: కేజ్రీవాల్

చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ పట్టపగలే మోసం చేసింది: కేజ్రీవాల్

చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ పట్టపగలే మోసాలకు పాల్పడిందని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్  మంగళవారం(జనవరి 30) అన్నారు. చండీగడ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మనోజ్ సోంకర్ ను గెలిపించేందుకు ఇంత దారుణానికి ఒడిగట్టిందని విమర్శించారు. మేయర్ ఎన్నికల్లోనే బీజేపీ ఇంత నీచానికి దిగజారితే లోక్ సభ ఎన్నికల్లో గెలవడానికి ఎంతవరకైనా వెళ్లగలదని కేజ్రీవాల్ అన్నారు. 

చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో పట్టపగలు మోసం జరిగిన తీరు చాలా ఆందోళన కలిగిస్తోంది. మేయర్ ఎన్నికల్లో ఇంత దిగజారితే సార్వత్రిక ఎన్నికల్లో ఏ స్థాయికైనా దిగజారవచ్చు.. ఇది చాలా ఆందోళన కరం అని కేజ్రీవాల్Xలో ట్వీట్ చేశారు. ఆప్, కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని  ఎన్నికల్లో పోటీ చేసింది. మొత్తం 35 మంది సభ్యులున్న సభలో బీజేపీ కంటే ఆప్, కాంగ్రెస్ కూటమికే ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు కేజ్రీవాల్.