ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం..భారీ వాహనాలపై నిషేధం

ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం..భారీ వాహనాలపై నిషేధం

వాయు కాలుష్యంపై ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. చలికాలంలో భారీ వాహనాలు, ట్రక్కులపై నిషేధం విధించింది. ఈ ఏడాది అక్టోబర్ నుండి ఫిబ్రవరి, 2023 వరకు ఢిల్లీలోకి భారీ వాహనాలను అనుమతించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. చలికాలంలో వాయుకాలుష్యం విపరీతంగా పెరుగుతుండడంతో ఆప్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ఢిల్లీ ప్రభుత్వం లేఖ కూడా రాసింది. BS VI కంప్లైంట్ బస్సులను మాత్రమే ఢిల్లీలోకి అనుమతించాలని కోరింది. 

భారీ వాహనాలపై ప్రతిసారి 15రోజులు మాత్రమే నిషేధం విధిస్తారు కానీ ఈ ఏడాది ఏకంగా 5నెలలు బ్యాన్ విధించడం గమనార్హం. కాగా ఢిల్లీలోకి రోజుకు సుమారు 70 వేల నుండి 80వేల వరకు ట్రక్కులు, భారీ వస్తాయి. దీంట్లో కూరగాయలు, పండ్లు, ఆహారపదార్థాలు,పెట్రోల్ ట్యాంకర్లు ఉంటాయి. అయితే ఢిల్లీ సర్కార్ నిర్ణయాన్ని వెహికిల్స్ అసోసియేషన్లు వ్యతిరేకిస్తున్నాయి. 15 రోజులు అంటే ఓకే గానీ ఏకంగా 5నెలలు నిషేధం విధిస్తే తీవ్రంగా నష్టపోతామని చెబుతున్నాయి. ఇది ప్రభుత్వ ఆదాయంపై ప్రభావం చూపుతుందని చెప్పారు.