త్వరలో కేజ్రీవాల్ ను అరెస్టు చేస్తారు: ఆప్ నేతల సంచలన వ్యాఖ్యలు

త్వరలో కేజ్రీవాల్ ను అరెస్టు చేస్తారు: ఆప్ నేతల సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అవుతారని సంచలన ఆరోపణలు చేశారు ఆప్ నేతలు. రెండు, మూడు రోజుల్లో.. సీఆర్పీ 41 కింద నోటీసులిచ్చి కేజ్రీవాల్ ను సీబీఐ, ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.  ఇండియా కూటమి నుంచి వైదొలగాలని తమకు బెదిరింపులు వస్తున్నాయని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్ కు 7వ సారి నోటీసులు ఇచ్చిన ఈడీ.. ఫిబ్రవరి 26వ తేదీన విచారణకు రావాలని ఆదేశించింది. ఈక్రమంలో ఆప్ నేతలు మాట్లాడుతూ విచారణకు హాజరైతే సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

కేజ్రీవాల్ కు ఈడీ ఇప్పటికే ఆరు సార్లు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.  తనకు ఈడీ నోటీసులివ్వడం చట్టవిరుద్ధమన్న కేజ్రీవాల్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా  విచారణకు హాజరు కాలేదు.