రెచ్చగొట్టే నినాదాలు చేసిన మైనర్ బాలుడు

రెచ్చగొట్టే నినాదాలు చేసిన మైనర్ బాలుడు

వారం రోజుల క్రితం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నిర్వహించిన మార్చ్‌లో  మత విద్వేషాలను రెచ్చగొట్టే నినాదాలు చేశారని ఆరోపిస్తూ కేరళ పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అందులో ఓ బాలుడు వివాదానికి తావిచ్చేలా స్లోగన్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇక వివరాల్లోకి వెళితే.. గత వారం అలెప్పీలో నిర్వహించిన పొలిటికల్ ర్యాలీలో ఓ సంఘటన చోటు చేసుకుంది. ఈ వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం ఓ మైనర్ బాలుడు ఒకతని భుజాలపైకి ఎక్కి  హిందువులు, క్రైస్తవులను రెచ్చగొట్టేలా నినాదాలు చేయడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికే అతని మైండ్ చాలా మారిపోయినట్టు తెలుస్తుందని .. ఇంత చిన్న వయసు నుంచే ఇలా అల్లర్లు, కల్లోలాలు సృష్టించే పనులు చేయడం ఏ మాత్రం మంచిది కాదని, ఇలాంటి పరిణామాలకు వెంటనే చరమగీతం పాడాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. 

మరిన్ని వార్తల కోసం....


రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

బీఫ్పై సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు