మూగ జీవాలను కాపాడండి: సుదర్శన్ పట్నాయక్

మూగ జీవాలను కాపాడండి: సుదర్శన్ పట్నాయక్

న్యూఢిల్లీ: కేరళలో ప్రెగ్నెంట్ ఏనుగు మృతిపై ప్రముఖ శాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ స్పందించాడు. శాండ్ ఆర్ట్ ద్వారా సదరు ఏనుగుతోపాటు దాని కడుపులోని బిడ్డకు ఆయన నివాళి అర్పించాడు.

తల్లి ఏనుగు పక్కన బిడ్డ ఏనుగు ఉన్నట్లుగా పూరి బీచ్ లో తాను రూపొందించిన శాండ్ ఆర్ట్ ఫొటోను ట్విట్టర్ లో సుదర్శన్ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ కు ‘మానవత్వం మళ్లీ చనిపోయింది. ఏనుగులను రక్షించండి’ అనే క్యాప్షన్ ను జత చేశాడు.

కేరళలో ఏనుగు మృతి ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనపై దర్యాప్తులో ఏ ఒక్క అంశాన్నీ వదిలేది లేదని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా, క్రికెటర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ఏనుగు మృతిపై స్పందించారు.

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రముఖ బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, జాన్ అబ్రహాంతోపాటు సాహో ఫేం శ్రద్ధా కపూర్ డిమాండ్ చేశారు. కాగా, ఈ ఘటనపై కేరళ వైల్డ్ లైఫ్​ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిందని కేరళ సర్కార్ తెలిపింది.