కరోనా ఎఫెక్ట్: ఉద్యోగుల కోసం సరికొత్త నిర్ణయం తీసుకున్న కేరళ ప్రభుత్వం

కరోనా ఎఫెక్ట్: ఉద్యోగుల కోసం సరికొత్త నిర్ణయం తీసుకున్న కేరళ ప్రభుత్వం

కరోనావైరస్ యొక్క వ్యాప్తిని నియంత్రించే ప్రయత్నంలో భాగంగా కేరళ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. అక్కడి ఉద్యోగులను రెండు వారాల పాటు పార్ట్ టైమ్ పని చేయమని ఆదేశించింది. ఎమర్జెన్సీ సేవలు కాకుండా మిగతా విభాగాలలో పనిచేసేవారు ఈ పద్ధతిని అనుసరించాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు.

‘ప్రతి కార్యాలయంలోని గ్రూప్ బి, సి మరియు డి ఉద్యోగులలో 50 శాతం మంది ప్రతిరోజు ఆఫీస్‌కు రాకుండా రోజు విడిచి రోజు ఆఫీస్‌కు రావాలి. వారు అలా రావడానికి ఆఫీస్ ఇన్‌ఛార్జీలు తగు ఏర్పాట్లు చేయాలి. ఇంట్లో ఉన్న ఉద్యోగులు తమ పనిని ఇ-ఆఫీస్ లేదా తమ కంప్యూటర్లను ఉపయోగించి చేయాలి’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఎవరైనా ఉద్యోగులు హోం క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తే వారికి 14 రోజుల పాటు సెలవులు మంజూరు చేస్తామని సీఎం విజయన్ తెలిపారు. అంతేకాకుండా విద్యాసంస్థలలో పనిచేసే ఉపాధ్యాయులు తమ విధులకు హాజరుకానవసరం లేదని.. ఆ హాజరుకాని రోజులను తర్వాత ఉపయోగించుకంటామని ఆయన తెలిపారు.

For More News..

కనికా కపూర్‌పై ‘కరోనా’ కేసు నమోదు

కరోనాపై విరుష్క జంట వీడియో సందేశం

కరోనాతో దేశాలు ఆగమాగం