2ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన కేరళ జర్నలిస్ట్

2ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన కేరళ జర్నలిస్ట్

గత రెండు సంవత్సరాల క్రితం ఉత్తరప్రదేశ్‌లో ఉగ్రవాద ఆరోపణలపై అరెస్టయిన కేరళకు చెందిన సిద్ధిక్ కప్పన్ అనే జర్నలిస్టు ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. హత్రాస్‭లో ఒక దళిత మహిళపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై రిపోర్టింగ్ చేయడానికి వెళ్లి, ఉగ్ర కార్యకలాపాల ఆరోపణలతో కప్పన్ ను పోలీసులు అరెస్టు చేశారు. కాగా అతనిపై ఉన్న రెండు కేసుల్లో బెయిల్ పొందిన నెల రోజుల తర్వాత లక్నోలోని ప్రత్యేక కోర్టు అతని విడుదల ఉత్తర్వులపై సంతకం చేసింది.

తాను క్రూరమైన చట్టాలకు వ్యతిరేకంగా నా పోరాటాన్ని కొనసాగిస్తానని కప్పన్ చెప్పారు. తనకు బెయిల్ వచ్చిన తర్వాత కూడా తనను జైల్లో ఉంచారని ఆరోపించారు. తాను జైలులో ఉండటం వల్ల ఎవరికి లాభం జరుగుతుందో తెలియదు గానీ.. ఈ రెండేళ్లు చాలా కష్టంగా గడిచిందని కప్పన్ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తాను ఎప్పుడూ భయపడలేదని స్పష్టం చేశారు. కప్పన్ నిన్న సాయంత్రమే బయటకు వస్తారని భావించారు. అయితే మనీలాండరింగ్ నిరోధక ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బార్ కౌన్సిల్ ఎన్నికలలో బిజీగా ఉన్నందున అతన్ని విడుదల చేయలేకపోయినట్టు సమాచారం.