
కొచ్చి: కేరళ నుంచి లండన్‌కు వెళ్లే ఎయిర్ఇండియా విమానానికి మంగళవారం తెల్లవారుజామున బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. విమానాన్ని నిలిపివేసి తనిఖీలు చేశారు. బాంబు ఉన్నట్లు ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కేరళలోని కొచ్చి ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌కు వెళ్లేందుకు ప్యాసింజర్ విమానం రన్‌వేపై రెడీగా ఉంది.
అదే టైంలో విమానంలో బాంబు ఉందని అగంతకుడు ముంబైలోని ఎయిర్ ఇండియా కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో అధికారులు ప్రయాణికులందరినీ కిందకు దించి భద్రతా తనిఖీలు జరిపారు. ఎలాంటి పేలుడు పదార్థాలు దొరక్కపోవడంతో ఫేక్ కాల్‌గా నిర్ధారించారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు బాంబు బెదిరింపు కాల్ చేసింది అదే విమానంలో వెళ్లేందుకు సిద్ధమైన కేరళలోని మలప్పురానికి చెందిన సుహైబ్(29) అని తేల్చారు. సుహైబ్తో పాటు అతడి భార్య, కూతురును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీలు ముగిసిన తర్వాత గంట ఆలస్యంగా విమానం లండన్‌కు బయల్దేరింది.