వీడెవడ్రా బాబూ.. ఏకంగా పోలీస్ స్టేషన్ భూమినే తాకట్టు పెట్టాడు,,,

వీడెవడ్రా బాబూ..  ఏకంగా పోలీస్ స్టేషన్ భూమినే తాకట్టు పెట్టాడు,,,

కేరళలో విచిత్రమైన ఘటన జరిగింది.  భూ లావేదేవీల విషయంలో వెల్లతూవల్ పోలీస్ స్టేషన్ పోలీసులు షాక్  తిన్నారు.  ఏకంగా పోలీస్ స్టేషన్  భూమిని రికవరీ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  

దొంగ పత్రాలు సృష్టించి బ్యాంక్ లోన్లు తీసుకోవడం.. ఎగ్గొట్టడం  వంటి ఘటనలు చాలా చూశాం.  ఆ తరువాత ఆ భూమిని బ్యాంక్ వారు కోర్టు అనుమతితో వేలం వేసి సొమ్మును రికవరీ చేస్తుంటారు. ఆ భూమిరి  వేలంలో ఎవరైతే దక్కించుకుంటారో..  వారికి  స్వాధీనం చేసి చట్టరీత్యా హక్కులు  కల్పిస్తారు.  ఇప్పుడు అలానే  బ్యాంకు వేలంలో ఓ వ్యక్తి భూమి కొనుగోలు చేశాడు.  కొంత కాలం తరువాత ఆ భూమిని మరొకరికి అమ్మేశాడు కూడా. అయితే.. కాగితాలపై ఉన్న భూమి.. వాస్తవంలో భూమికి మధ్య పొంతన లేకుండా ఉన్నది. ఈ భూమిని తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నాడు. కానీ, లోన్ కట్టలేదు. దీంతో భూమి రికవరీ చేసుకోవాలని ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. అయితే.. ఆదేశాలు ఇచ్చిన భూమిలో పోలీసు స్టేషన్, పోలీసు హెడ్ క్వార్టర్ కూడా ఉన్నది. దీంతో పోలీసులు షాక్ అయ్యారు. ఈ ఘటన కేరళలోని ఇదుక్కిలో చోటుచేసుకుంది.

వెల్లతూవల్ పోలీసు స్టేషన్‌కు  డెట్ రికవరీ ట్రిబ్యునల్ నుంచి ఓ ఇంటిమేషన్ వచ్చింది. అదేమిటంటే.. వెల్లతూవల్ పోలీసు స్టేషన్, దాని హెడ్ క్వార్టర్స్ ఉన్న భూమిని అటాచ్ చేసినట్టు సందేశం ఉన్నది. దీంతో జిల్లా పోలీసు చీఫ్ వెంటనే రంగంలోకి దిగారు. 1989లో జిల్లా కలెక్టర్ ఆ భూమిని పోలీసు స్టేషన్ అవసరాల కోసం కేటాయించిన ఆదేశాల పత్రాన్ని డెట్ రికవరీ ట్రిబ్యునల్‌కు అందించారు.

దీంతో మరోసారి సర్వే చేశారు. హెడ్ సర్వేయర్ సమీక్ష చేయగా.. అటాచ్ చేయాల్సిన ఆస్తుల నుంచి పోలీసు స్టేషన్ మినహాయించారు. ఈ రిపోర్టును తహశీల్దార్‌కు అందించినట్టు వివరించారు. బ్యాంకుకు గ్యారంటీగా ఇచ్చిన భూమి సరిహద్దులు తేల్చాలని ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన వ్యక్తి వాదనలకు భిన్నంగా వాస్తవాలు ఉన్నాయని వివరించారు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

2012 వేలంలో కొనుగోలు చేసిన భూమి గురించి కొనుగోలుదారు చెప్పినట్టుగా పెద్ద స్ట్రెచ్ కాదని, ఆయన చెబుతున్నదాని కంటే తక్కువ మొత్తంలోనే ఆ భూమి ఉన్నదని సర్వేయర్ తెలిపారు. ఆ భూమిని కొనుగోలు దారు వేరేవారికి అమ్మేశాడు. రోడ్డు, చెంకుల డ్యాం నుంచి వెళ్లే చిన్న కాల్వకు మధ్య ఉన్న భూమిని బ్యాంకుకు గ్యారంటీగా ఇచ్చారని స్పష్టంగా ఉన్నదని తెలిపాడు. ఈ పోలీసు స్టేషన్ దానికి బయట, రోడ్డుకు ఆవల ఉన్నదని స్పష్టం చేశాడు. దీనిపై ఇంకా ఆదేశాలు రావల్సి ఉంది.