డ్రగ్ అమ్ముతూ పట్టుబడిన కేరళ స్టూడెంట్

డ్రగ్ అమ్ముతూ పట్టుబడిన కేరళ స్టూడెంట్

జీడిమెట్ల, వెలుగు :  సిటీలో డ్రగ్​అమ్ము తూ కేరళ స్టూడెంట్ పట్టుబడ్డాడు. సూరారం పోలీసులు తెలిపిన  ప్రకారం... కేరళలోని కున్నంథానం గ్రామానికి చెందిన జిబిన్​బీసీ(22) ఇంజనీరింగ్​ స్టూడెంట్. అతనికి  డ్రగ్స్​తీసుకునే అలవాటు ఉంది. దీంతో ఇంట్లో ఇచ్చే పాకెట్​ మనీ జల్సాలకు సరిపోకపోతుండగా.. డ్రగ్స్​ సప్లయ్ కి ప్లాన్ చేశాడు.

ఫ్రెండ్ ​ద్వారా హైదరాబాద్​లో ఉండే బిజ్జు అచ్చుతమ్ ​అలియాస్​ మ్యాడ్​బ్యాయ్​వద్ద ఎండీఎంఏ డ్రగ్ ​దొరుకుతుందని తెలుసుకొని జిబిన్ 25 రోజుల కిందట ఇక్కడికి వచ్చాడు. ఆరు రోజుల కిందట అచ్చుతమ్​కు  ఫోన్ చేయగా ఫిల్మ్​నగర్​లోటస్ పాండ్ వద్దకు రమ్మని చెప్పగా వెళ్లి.. 6 గ్రాముల ఎండీఎంఏ కొనుగోలు చేశాడు. సోమవారం గాజుల రామారం ఆదర్శనగర్​లోని మెట్రో ఫంక్షన్​ హాల్​వద్ద డ్రగ్​ అమ్మేందుకు యత్నిస్తుండగా జిబిన్ ను పోలీసులు అరెస్ట్​ చేసి రిమాండ్​కి తరలించారు.