దొంగలందు మంచి దొంగలు వేరయా..!

దొంగలందు మంచి దొంగలు వేరయా..!

దొంగలందు మంచిదొంగలు వేరయా..! నిజమే.. డబ్బు కోసం దొంగలు మర్డర్లు చేయడం చూస్తుంటాం.. డబ్బు తీసుకున్న వెంటనే పారిపోవడం గమనిస్తుంటాం. అయితే కేరళ చెందిన ఓ దొంగ..దొంగతనానికి వచ్చి చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కేరళ త్రిపునితుర సమీపంలో తిరువంకులంలో రిటైర్డ్ కల్నల్ నివాసం ఉంటున్నారు. రెండు నెలల క్రితమే శుభకార్యం నిమిత్తం మరోప్రాంతానికి వెళ్లారు. అదే సమయంలో ఓ దొంగ కల్నల్ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డాడు. ఇంట్లో చొరబడి ఎత్తుకేళ్లేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నాడు. కానీ అప్పుడే ఆ దొంగకు పక్కనే ఉన్న ఆర్మీ క్యాప్ కనపడింది. దీంతో ఆ మంచిదొంగ “ ఆర్మీ వాళ్లంటే నాకు చాలా గౌరవం ఉంది. ఈ ఇల్లు ఆర్మీ వాళ్లదని తెలిస్తే దొంగతనం చేసేవాడిని కాదు. బైబిల్ లోని ఏడవ ఆజ్ఞ ఉల్లంఘించకూడదు. కానీ దొంగతనం చేసి ఆజ్ఞను ఉల్లంఘించాను. క్షమించండి అంటూ ఓ స్కెచ్ పెన్నుతో గోడపై రాసి దొంగతనం చేసిన వస్తువుల్ని అక్కడే ఉంచి పరారయ్యాడు.

దొంగతనం జరిగిన మరుసటి రోజు కల్నల్ ఇంటిని శుభ్రం చేసేందుకు వచ్చిన పనిమనిషికి ఇంటి తాళాలు బద్దలు కొట్టినట్లు గుర్తించింది. ఇంట్లో సామాను చిందరవందరగా పడి ఉండడం, క్షమాపణకోరుతూ గోడపై రాసి ఉండడంతో  పోలీసులుకు సమాచారం అందించింది.

సమాచారం అందుకున్న పోలీసులు కల్నల్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇంట్లో దొంగతనం జరగలేదని అయినా దొంగను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.